పది లక్షల విలువ చేసే పుస్తకాల పంపిణీ
1 min readయూనివర్సిటీని అభివృద్ధి చేసింది కూటమి ప్రభుత్వమే
మొక్కలు నాటిన ఎమ్మెల్యేలు గిత్త,గౌరు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కర్నూలు రాయలసీమ యూనివర్సిటీని అభివృద్ధి చేసింది కూటమి ప్రభుత్వమేనని ఎమ్మెల్యేలు అన్నారు.గురువారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా యూనివర్సిటీ ప్రాంగణంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య,పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి,కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎన్ టి కే నాయక్ తో కలసి మొక్కలను నాటారు.విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ,చదువుకున్న ప్రతి యువతీ యువకులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నారా లోకేష్ కృషి చాలా గొప్పదని నందికొట్కూరు,పాణ్యం,కోడుమూరు ఎమ్మెల్యేలు జయసూర్య,చరితా రెడ్డి,బొగ్గుల దస్తగిరి అన్నారు.లోకేష్ జన్మదినం సందర్బంగా యూనివర్సిటీ పేద విద్యార్థులకు 10 లక్షల విలువ చేసే పుస్తకాలను దాత స్పెక్ట్రమ్ పబ్లికేషన్ అధినేత సూరినేని మోహన్ నాయుడు అందించిన పుస్తకాలను పేద విద్యార్థులకు వారు అందజేశారు.తర్వాత విద్యార్థుల సమక్షంలో భారీ కేకును వారు కట్ చేశారు. పుస్తకాలను ఉచితంగా అందజేసిన దాత మోహన్ నాయుడును ఎమ్మెల్యేలు అభినందించారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీరాములు,నవ్యంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు అయ్యస్వామి,ఆర్యు ఎన్ఎస్ఎస్ కోర్డినేటర్ నాగరాజు,నారాయణ,నాగరాజు,హుస్సేన్,వెంకటస్వామి లైబ్రరిన్ నాగభూషణం,ఆర్ యు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ హరిప్రసాద్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.