“విష్ణు సేన ఆర్గనైజేషన్” మెడికల్ కాలేజీకి కుర్చీలు వితరణ..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: విష్ణు సేన సభ్యులు బుధవారం కర్నూల్ మెడికల్ కాలేజీలోని ఫోరెన్సిక్ విభాగానికి 20 కుర్చీలు రెండు ఆఫీస్ టేబుల్ లు వితరణ చేయడం జరిగింది. వీటిని హెచ్ ఓ డి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి సుదీర్ కు వారి విభాగం లో అందజేయడం జరిగింది.. వారిని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె చిట్టి నరసమ్మ మరియు ఫోరెన్సిక్ విభాగపు అధిపతి లు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విష్ణు సేన నాయకులు మాట్లాడుతూ విష్ణు సేన ఆర్గనైజేషన్ సమాజ సేవలో ముందుంటుందని అవకాశమున్న మేరకు వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటున్నమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఫోరెన్సిక్ విభాగపు డాక్టర్లు డా.నాగార్జున, డా, హరీష్, డా.సాహిల్ ల్యాబ్ టెక్నీషియన్ వేణు మరియు వితరణ ఇచ్చిన ఇ.తాండ్ర పాడు తెలుగు శేషన్న, విష్ణు సేన నాయకులు వితరణ దాత ఇ.తాండ్ర పాడు తెలుగు శేషన్న, రసూల్ ఖాన్ రామాంజనేయులు ఈ తాండ్ర పాడు తెలుగు శేషన్న,కోడుమూరు ఐటిడిపి అధ్యక్షులు కృష్ణ కర్నూలు మండల తెలుగు యువత అధ్యక్షులు సూర్యప్రకాష్ తదితరులు ఈ వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.