రైతులకు మినుము విత్తనాలు పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ( జాతీయ ఆహార భద్రత పథకం) ద్వారా 2024 రబీ కి గాను 100% శాతం సబ్సిడీపై రైతులకు విత్తనాలు పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి కె శ్రీదేవి తెలిపారు. మండలంలోని శివాల పల్లె, ఉప్పరపల్లె గ్రామ రైతులకు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కల్లూరు విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా విత్తనాలను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. చెన్నూరు మండలం కు 500 మినీ కిట్లు మినుము విత్తనాలు వచ్చాయని ఒక్కొక్క కిట్ కు నాలుగు కేజీల విత్తనాలు ఉంటాయని ఆమె తెలిపారు, ఈ విత్తనాలన్నీ కూడా శుద్ధి చేసిన విత్తనాలని రైతులు రైతు సేవ కేంద్రాలకు పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకెళ్లి అక్కడ బయోమెట్రిక్ పద్ధతి ద్వారా విత్తనాలు తీసుకోవాలని రైతులకు తెలిపారు. అదేవిధంగా మండలంలోని రామనపల్లె గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ తాడిగుడ్ల వెంకటసుబ్బారెడ్డి (బుజ్జన్న ) ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా మినుములు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇందిరెడ్డి శివారెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకులు టి కమలి, డి చరణ్ కుమార్ రెడ్డి రెడ్డి, సునీల్, కార్యదర్శి గురువేశ్వరరావు, నాగేశ్వరి ,రైతులు పాల్గొన్నారు.