మెట్టుపల్లిలో విద్యార్థులకు కిట్ల పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు నూతన ప్రభుత్వం “స్టూడెంట్ కిట్” పేరుతో బ్యాగ్,బుక్స్,బూట్లు,బెల్ట్,దుస్తులు తదితర విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందిస్తుందని, విద్యార్థులు ఈ స్టూడెంట్ కిట్ ను చక్కగా ఉపయోగించుకుని, సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్ర గుప్త మెట్టుపల్లి విద్యార్థులకు సూచించారు.మెట్టుపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సుంకన్న (మాజీ యం. పీ. టీ. సీ) , తెలుగు శేఖర్, విష్ణు వర్ధన్ రెడ్డి, సాంబ శివుడు, మద్ది లేటి, రాధా కృష్ణ , తదితరుల సమక్షంలో పాఠశాల విద్యా ర్థలకు స్టూడెంట్ కిట్ ను పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో గ్రామ పెద్దలు,తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, విద్యావంతులు, దాతలు మొదలైన వారు అందరూ సంపూర్ణ సహకారం అందించినపుడే పాఠశాలల అభివృద్ధి సాధ్యపదుతుందని ప్రధానోపాధ్యాయులు రవీంద్ర గుప్త తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు చిన్నప రెడ్డి, శివ, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.