PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెప్టిక్ ట్యాంక్,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిబ్బందికి మేయర్ పి పి ఈ కిట్లు పంపిణీ

1 min read

పారిశుద్ధ్య కార్మికులకు ఆయుష్మాన్ పథకం ద్వారా హెల్త్ కార్డులు ఐదు లక్షలు ఇన్సూరెన్స్

పాల్గొన్న పలువురు కార్పొరేటర్లు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు.మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న  మున్సిపల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిబ్బంది మరియు ప్రైవేట్ సెప్టిక్ ట్యాంక్ సిబ్బందికి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని ఉదయం మేయర్ చాంబర్లో పిపిఈ కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు,కమిషనర్ భాను ప్రతాప్ మాట్లాడుతూ. ఏలూరు శాసనసభ్యులు  బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆదేశాలతో కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న  మున్సిపల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిబ్బంది. మరియు ప్రైవేట్ సెప్టిక్ ట్యాంక్ సిబ్బంది 62 మందికి స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ ద్వారా వచ్చిన పి పి ఈ కిట్లను ఈరోజు అందజేశామన్నారు.ఈ కిట్లలో చేతి గ్లౌజులు,ఫుల్ షూట్ డ్రెస్సు, గంషూ,హెల్మెట్,గ్యాస్ మాస్క్,కళ్లద్దాలు మొదలగునవి ఉంటాయన్నారు.వీరు చేసే పనులు ద్వారా వీరి ఆరోగ్యం శుభ్రంగా ఉండాలని ఆరోగ్య భద్రత కోసం వారి ఒంటికి మలినాలు అంటకుండా ఉండాలని,డ్రైనేజీల ద్వారా వెదజల్లే విషవాయువు నుండి రక్షణగా పి పి ఈ కిట్లు ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వీరికి 5 లక్షల రూపాయల వేలిజిబులిటీ గల ఇన్సూరెన్స్ మరియు హెల్త్ కార్డులను వీరికి అందించారు.అలాగే రోడ్లు మీద చెత్త కాగితాలు,ప్లాస్టిక్ వ్యర్ధాలు  మొదలగులనవి ఏరుకుంటూ తిరిగే  వారిని కూడా గుర్తించి వారికి హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ వర్తించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి.చంద్రయ్య,డి.ఈ రజాక్,ఏ.ఈ సాయి, కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాసరావు,జున్నూరు కనక నరసింహారావు,సబ్బన్న శ్రీనివాసరావు,జజ్జవరపు విజయనిర్మల,నున్న కిషోర్,ఈదుపల్లిపవన్,కో-ఆప్షన్ సభ్యులు కొల్లేపల్లి రాజు,జాల సుమతి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

About Author