PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అల్లూరు..చౌటుకూరులో ఎమ్మెల్యే పింఛన్ల పంపిణీ

1 min read

ముందే పింఛన్లు అందించిన ఘనత సీఎం చంద్రబాబుకే సాధ్యం

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): ఒకటవ తేదీ కంటే ముందుగానే పింఛన్లు అందించిన ఘనత కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కే దక్కిందని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. శనివారం ఉదయం అల్లూరులో  ఎమ్మెల్యే మరియు డీఆర్డిఏ పీడీ శ్రీధర్ రెడ్డి,మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,ఎంపీడీవో శోభారాణి పింఛన్లు పంపిణీ చేశారు.తర్వాత మిడుతూరు మండలంలో చౌటుకూరు గ్రామంలో పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేశారు.ముందుగా ఎమ్మెల్యేకు ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,నాయకులు గోకారి,శబ్బు,నరసింహ గౌడ్, శాలువాలు పూలమాలతో ఘన స్వాతం పలికారు.వర్షం పడుతున్నా లెక్కచేయకుండా లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పింఛన్లను అందజేస్తూ ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 3 వేలు వచ్చేదని ఒకేసారి పింఛన్ పెంచడంతో సంతోషంగా ఉందని డబ్బులు స్వయంగా ఎమ్మెల్యేకు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. మిడుతూరులో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, తలముడిపి లో వంగాల శివరామిరెడ్డి,పైపాలెంలో శ్రీనివాసరెడ్డి, కలమందలపాడులో  సర్వోత్తమ్ రెడ్డి,నాగలూటీలో రమణారెడ్డి,సంపంగి రవీంద్రబాబు,దేవనూరులో మాజీ సర్పంచ్ నాగేంద్రుడు, బైరాపురంలో చాకర్ వలి అధికారులతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు.మండలంలోని అన్ని పల్లెల్లో ఉదయం 6 గంటల నుండే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఈవోఆర్డీలు సంజన్న,ఫక్రుద్దీన్ మరియు పంచాయతీ కార్యదర్శులు శివ కళ్యాణ్ సింగ్,చంద్రశేఖర్ రెడ్డి, బీజాన్ బీ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author