PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మెడికల్ సర్టిఫికెట్ల పంపిణీ

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి   మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మెడికల్ బోర్డు సర్టిఫికెట్ల కొరకు  117 మంది దరఖాస్తు చేసుకోగా అందులో అర్హులైన ఆరు మందికి పెరాలసిస్ బాదితులకు ఈరోజు మెడికల్ సర్టిఫికెట్లను పంపిణీ చేసినట్లు తెలియజేశారు.ఆసుపత్రిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మెడికల్ బోర్డుకు సంబంధించి  ప్రతి బుధవారము ధన్వంతరి హాల్లో  ఉదయం 11 గంటల నుంచి 1:00 వరకు మెడికల్ బోర్డు నిర్వహిస్తారని తెలిపారు.ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మెడికల్  సర్టిఫికెట్లు కావలసినవారు ముందుగానే వచ్చి తమ ఫోన్ నెంబర్ తమ ధరఖాస్తూ తో పాటు , రెండు ఫోటోలు ఆధార్ కార్డు, సదరమ్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికట్లు, ఫోన్ నెంబర్ ఇచ్చి నమోదు చేసుకొని వారికి సీనియారిటీ ప్రకారం వారికి దఫాలవారిగా పిలిచి అందులో  అర్హులైన వారికి సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుంది అని అన్నారు.బుధవారము సెలవు రోజులలో తప్ప మిగతా అన్నిరోజులలో ధరఖాస్తూ చేసుకోవచ్చు అని తెలియజేశారుఆసుపత్రిలో  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కు సీనియర్ అసిస్టెంట్ అయినా శ్రీ.జమల్ ని  నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చేశారు.ఈ కార్యక్రమానికి ARMO, డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, సీనియర్ అసిస్టెంట్, శ్రీ.జమల్,తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి, తెలిపారు.

About Author