PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్థిక పరిస్థితులున్నా పింఛన్ల పంపిణీ..

1 min read

ఉద్యోగుల జీతాలు ఒకటవ తేదీనే..

త్వరలో నందికొట్కూరులో అన్న క్యాంటిన్లు  ప్రారంభం

పింఛన్లు స్టూడెంట్ కిట్లు ట్రాక్టర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..మాండ్ర

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలా సాగింది మంగళవారం కొత్తపల్లి, పాములపాడు,జూపాడుబంగ్లా మండల కేంద్రాల్లో తెదేపా నాయకులు అధికారులు అవ్వ తాతలు,వితంతువులు దివ్యాంగుల ఇంటి దగ్గరికి వెళ్లి పెంచిన పింఛన్ల నగదును ఎమ్మెల్యే జయసూర్య, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నా పింఛన్లు మరియు ఉద్యోగుల జీతాలు చెల్లించుటకు 5వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారని గతంలో ఉద్యోగులకు మరియు రిటైర్డ్ పింఛన్ దారులకు జీతాలు ఎప్పుడు వచ్చేదో తెలియని పరిస్థితి ఉండేదని ప్రభుత్వం వచ్చాక 1వ తేదీనే జీతాలు ఉద్యోగుల అకౌంట్లో పడ్డాయని అన్నారు.ఈ మూడు మండల కేంద్రాల్లో పింఛన్ల పంపిణీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు. మండలాల్లో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా వచ్చిన పంచాయితీలకు ట్రాక్టర్లను వారు పంపిణీ చేశారు.అదే విధంగా జూపాడు బంగ్లా మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో విద్యార్థులకు విద్యార్థి కిట్లను ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజునే ఐదు సంతకాలు చేశారని పేదలకు అనుగుణంగా నందికొట్కూరు పట్టణంలో 5 రూ.లకే అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుందని ఎలాంటి విడతలుగా లేకుండా ఒకేసారి భారీగా పింఛన్లను పెంచిన ఘనత ప్రభుత్వానికి దక్కిందని వారు అన్నారు.టిడిపి జిల్లా అధికార ప్రతినిధి గిరీశ్వర్ రెడ్డి, ఎంపీపీ మండ్ల మల్లీశ్వరి, మండల అధికారులు మరియు నాయకులు పాల్గొన్నారు.

About Author