PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల వ్యాప్తంగా జోరుగా పెన్షన్ల పంపిణీ

1 min read

ఇంటింటికి వెళ్లి అవ్వ తాతలను పలకరించి పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రతి అవ్వ తాతల కళ్ళల్లో వెలుగు చూడడమే ప్రభుత్వ ధ్యేయం.. ఎమ్మెల్యే పుత్తాకృష్ణ చైతన్య రెడ్డి

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు: అసహాయులకు, అభాగ్యులకు, దివ్యాంగులకు, వివిధ రకాల దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారందరికి అండదండగా ఉంటూ వారి ఆర్థిక భద్రత భరోసాగా నిలిచేందుకు నాడు మాజిక పెన్షన్లు ప్రవేశపెట్టిన మహనీయులు ఎన్టీఆర్ పేరుపైన రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ లాగా, ఒక జాతర లాగా అవ్వ తాతల ముఖాలలో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా వారికి 4000 రూపాయలతో పాటు, ఏప్రిల్ నుండి జూలై నాటికి 3000 రూపాయలతో కలిపి ₹7,000 ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగిందని కమలాపురం శాసనసభ్యులు పుత్త కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు, సోమవారం ఆయన మధ్యాహ్నం చెన్నూరు లోని ఇంటింటికి వెళ్లి అక్కడ ఉన్న దివ్యాంగులకు, అవ్వ తాతలను ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలు తెలుసుకొని పెన్షన్లు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక పెన్షన్ల విషయంలో అవ్వ తాతలకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కూడా ఒక ఆసరాగా, ఒక బాసటగా నిలిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లను మూడువేల నుండి 4 వేల వరకు పెంచి ఇవ్వడం జరుగుతుందన్నారు, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి నెలలో ఒకటవ తేదీ తెల్లవారక ముందే సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు, గతంలో కూడా వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ను 2000 రూపాయలకు పెంచిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనన్నారు, అంతకుముందు ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు బాణాసంచ పేలుస్తూ పూలు చల్లుతూ బ్యాండ్ బాజాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు, చెన్నూరు తాసిల్దార్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మహిళలతో పాలాభిషేకం గావించారు, తదుపరి ఎమ్మెల్యే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చెన్నూరు లోని ఇంటింటికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లు పంపిణీ చేశారు, ఈకార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ కల్లూరు విజయభాస్కర్ రెడ్డి,ఇందిరెడ్డిరెడ్డి శివారెడ్డి ,పొట్టి పాటి రాణా ప్రతాపరెడ్డి, గుమ్మల మల్లికార్జున్రెడ్డి, బుజ్జి రెడ్డి, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, ముండ్ల శ్రీనివాసులు రెడ్డి, హనుమాన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఆకుల ప్రసాద్ బాబు, లేవాకు శివా రెడ్డి, మైనార్టీ నాయకులు షబ్బీర్, కె సుభాన్ భాష, కరీం, యామాల మణికంఠ , సుబ్రహ్మణ్యం డాక్టర్ పిచ్చయ్య, కల్లూరు ఓబుల్ రెడ్డి, కుందేటి లడ్డు బాబు, శ్రీను, రాంప్రసాద్, సచివాలయ ఉద్యోగులు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author