నూతన సంవత్సరం సందర్భంగా 65 లక్షల పెన్షన్ దారులకు పెన్షన్ల పంపిణీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: వి. శైలజ, 31 వార్డు టిడిపి నాయకురాలు, వై.నాగేశ్వరరావు యాదవ్, తెలుగుదేశం పార్టీ బీసీ యాదవ సాధికారిక సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం స్థానిక టిడిపి ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో కర్నూల్ లోని 31 వ వార్డు నందు సచివాలయ సిబ్బంది మరియు హెల్త్ ఇన్స్పెక్టర్, 31 టీడీపీ నాయకులు శ్రీమతి శైలజ, తెలుగుదేశం పార్టీ బిసి యాదవ సాధికారిక సమితి రాష్ట్ర అధ్యక్షులు వై. నాగేశ్వరరావు యాదవ్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 30 సంవత్సరాల లో మొట్టమొదటిసారిగా ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి 2730 కోట్ల పింఛన్ల మొత్తాన్ని అవ్వ తాతలకు పంపిణీ చేసి, వారిచేత శభాష్ అనిపించుకున్న ఘనత ఒక చంద్రబాబు నాయుడు కే దక్కుతుందని ఈ సందర్భంగాతెలియజేశారు. రాఘవేంద్ర నగర్ లోని సరస్వతి భర్త చనిపోతే ఒక్క నెలలోనే పెన్షన్ మంజూరు చేసిన ఘనత కేవలం ఒక చంద్రబాబు నాయుడు కే సాధ్యమని చంద్రబాబు నాయుడు కి మరియు టిడిపి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 200 పెన్షన్ నుండి 2000లకు 2000 నుంచి 4 వేలకు పెన్షన్లు మంజూరు చేసే అవ్వ తాతలకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి అందరితో శభాష్ అనిపించుకున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కే దక్కుతుంది అని ఈ సందర్భంగా తెలియజేశారు.