PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలకు బహుమతులు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు మండలం రామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏకలవ్య ఫౌండేషన్ విద్యా వాహిని కార్యక్రమంలో భాగంగా జూలై నెలలో నిర్వహించిన“నీరు ప్రాముఖ్యత నేటి సమస్యలు పరిష్కారాలు” అనే అంశంలో వకృత పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థినిలకు గురువారం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు. ఉమామహేశ్వరి. ఉపాధ్యాయులు విద్యార్థినిలకు బహుమతులు అందజేశారు. సీనియర్స్ విభాగంలో గెలుపొందిన విద్యార్థినిలు ఎం శివ కుసుమ. ఏ రామ నిహారిక. పి సంగీత గెలుపొందిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఉమామహేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు వకృత్వ పోటీలు. ఆటల పోటీలు ఎంతో అవసరం అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *