PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్కూలు కిట్లు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:  ప్యాపిలి మండల పరిధిలోని వెంగళంపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ బోయపాటి జయశీలమ్మ మనవరాలు మొదటి పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం వెంగళంపల్లి గ్రామంలోని హై స్కూల్, మరియు రెండు ఎలిమెటరీ పాఠశాల లోని  170 మంది విద్యార్థుల మధ్య తమ మనవరాలు పుట్టినరోజు జరుపుకుని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు  భోజనం సదుపాయం కలిగించి, మరియు విద్యార్థులకు జమెంట్రీ బాక్స్  , పెన్స్ , పెన్సిల్ క్మరియు చాక్లెట్స్  సుమార్ 250 రూపాయలు విలువచేసే కిట్లను విద్యార్థులకు వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జయ శీలమ్మ మాట్లాడుతూ తమ మనవరాలు పుట్టినరోజు ‌పేద విద్యార్థుల మధ్య జరుపుకుని పెద విద్యార్థులకు స్కూల్ కిట్లు పంచడం చాలా సంతోషంగా ఉందని తమ కుమారుడు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నారు. హైదరాబాదులోని ఫంక్షన్ హాల్ లో గ్రాండ్ గా చేయొచ్చు కానీ సొంత గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య సొంత ఊరిలో  ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థుల మధ్యన తమ మనవరాలు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, అలాగే తమ భర్త టిడిపి నాయకులు  కీర్తిశేలు శేషయ్య కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ అందరు మనుషులో వుండిపోయారు. తమ భర్త శేషయ్యను తమ కుమారులు ప్రఫుల్ల కుమార్, శంకర్ ,జయశ్రీలమ్మ  కొనియాడారు. ఆయన చలవోతోనే  మేము ఈ స్థాయిలో వుంటు ప్రజల్లో గుర్తింపు పొందామని, ఎప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ఆమె తెలిపారు.అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు జై శీలమ్మ మనవరాలు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయు ఆరోగ్యాలతో, విద్యాబుద్ధులతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలోఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బోయపాటి జయశేలమ్మ , వెంకటరముడు, వెంగలంపల్లి గ్రామస్తులు చింతా రామ్ బాబు, బోయపాటి రాము, అలా రమణ, నారాయణ స్వామి, చింతా రమేష్, వేణుగోపాల్ , మరియు పాఠశాల ఉపాధ్యాయులు వేషాన్ని ,సుకుర్ ,కౌసార్,సులంద తదితరులు పాల్గొన్నారు.

About Author