PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవత్వం చూపిన జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి

1 min read

రైల్వేస్టేషన్లో నిరాశ్రయులుగా ఉన్న ఆ కుటుంబాన్ని వారీ స్వగ్రామం చేరేందుకు ఏర్పాట్లు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వాచ్ మెన్  ఉద్యోగం కోసం సుధీర్ ప్రాంతం నుండి ఏలూరు రైల్వే స్టేషన్ వచ్చి సంబంధిత వ్యక్తుల ఆచూకీ తెలియకపోవడంతో ఒక కుటుంబం నిరాశ్రయులుగా మిగిలింది. గత నాలుగు రోజులుగా ఏలూరు రైల్వేస్టేషన్లో నిరాశ్రయులుగా ఉన్న ఆ కుటుంబం సోమవారం ప్రజా పరిష్కార వ్యవస్థ (మీకోసం) కార్యక్రమానికి వచ్చి తమ గోడుని జిల్లా కలెక్టరు కె.వెట్రీసెల్వికు విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి ఆ కుటుంబ పెద్ద కర్రేగొర్ల నాగేశ్వరరావు చెప్పిన సమస్యను కలెక్టర్ విని వాచ్ మెన్ ఉద్యోగం కోసం ఒక వ్యక్తి చెప్పిన మాట విని విశాఖపట్నం జిల్లా, గంపరాయి నుంచి ఏలూరు తన కుటుంబం వచ్చిందని తీరా ఏలూరు రైల్వే స్టేషన్ కు వచ్చాక తమను రమ్మన్న సదరు వ్యక్తి ఆచూకీ లేకపోవడంతో గత నాలుగు రోజులుగా దిక్కుతోచని పరిస్థితుల్లో వున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి సదరు కుటుంబం కోరిన విధంగా వారిని ఆదుకుని మానవత్వం చాటుకున్నారు. వారి స్వగ్రామం చేరేందుకు  ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.వారి  దుస్థితిని గమనించిన కలెక్టర్ వన్ స్టాప్ సెంటర్ ద్వారా నూతన వస్త్రాలు ఏర్పాటు చేయాలని ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఆ కుటుంబానికి భోజన ఏర్పాట్లు కల్పించి కొంత నగదు సహాయం అందజేయాలని డిఆర్డిఏ పీడి ఆర్.విజయరాజును ఆదేశించడంతో వారు సంబంధిత కుటుంబానికి తగు ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ కుటుంబం రోడ్డును పడకుండా స్వగ్రామం చేరేందుకు మార్గం సుగమం అవడంతో ఆ కుటుంబం జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి వారికి కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై జిల్లా అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్ తీసున్న చర్యలకు అభినందనలు తెలిపారు.

About Author