చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.. ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. గురువారం ఉంగుటూరు, పాతూరు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తో కలిసి పంపిణీ అనంతరం శాసనసభ్యులతో కలిసి భీమడోలు గ్రామంలో నిర్వహిస్తున్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు ఇంటింటి నుండి చెత్త సేకరణ, తడి ,పొడి చెత్త విభజన మరియు వర్మి కంపోస్టు తయారీ విధానము చెత్త నుంచి తయారైన ఎరువులు ప్యాకెట్లు రేట్లు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయం వద్ద ఉన్న హెల్త్ క్లినిక్ ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డిఓ ఖాజావలి, డిపిఓ తూతిగా శ్రీనివాసు విశ్వనాధ్, డీఆర్డీఏ పీడీ డాక్టర్ విజయ రాజు, ఎంపీడీవో స్వర్ణలత తదితరులు ఉన్నారు.