బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు ఎంపికయిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కు 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి.గత ఏడాది బాపట్ల కలెక్టర్ గా 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కన్పరిచినందుకు ఎన్నికల కమిషన్ బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ కు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ను ఎంపిక చేసింది.. ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితా తయారీకి పలు సూచనలు, నూతన ఓటర్లను చేర్పించడం, అనర్హులను తొలగించడం, ఓటరు జాబితాలో అభ్యంతరాలను పరిష్కరించడం, ఎన్నికలను సజావుగా నిర్వహించడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆ అవార్డుకు కలెక్టర్ ను ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం పురష్కరించుకొని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగనున్న కార్యక్రమంలో కలెక్టర్ పి.రంజిత్ బాషా ఈ అవార్డును స్వీకరిస్తారు.