PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఇంఛార్జి కలెక్టర్

1 min read

వాంతులు, విరోచనాలతో మరణించిన బాలిక (జ్యోతి) కుటుంబాన్ని పరామర్శించిన ఇన్చార్జి కలెక్టర్

మరో పది రోజుల వరకు గ్రామంలో  మెడికల్ క్యాంపు నిర్వహించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించిన ఇన్చార్జి కలెక్టర్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు/మంత్రాలయం: సోమవారం మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామాన్ని సంబంధిత  శాఖల అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సందర్శించారు..వాంతులు, విరోచనాలతో మరణించిన బాలిక (జ్యోతి) కుటుంబాన్ని  ఇన్చార్జి కలెక్టర్ పరామర్శించారు..అనంతరం గ్రామ సచివాలయం లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఇన్చార్జి కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో పరిస్థితి బాగుపడేంతవరకు వారం లేదా పది రోజులైనా కానీ మెడికల్ క్యాంపు పెట్టి గ్రామస్థులకు వైద్య సహాయం అందచేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. MLHP ని,పి హెచ్ సీ  డాక్టర్ ను ఊళ్లోనే ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో కలుషితమైన తాగునీరు కలుషితం అయిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి నీటి శాంపిల్స్ ను  పరీక్షలకు పంపించడం జరిగిందని తెలిపారు.. అప్పటివరకు  రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటిని సరఫరా చేయాలని సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో నీటిని టెస్ట్ చేయాలని, ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు..వానాకాలం అయినందున ప్రజలు కూడా నీటిని కాచి తా గేలా అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. గ్రామాల్లో డయేరియా లేదా ఇలాంటి వ్యాధులతో బాధపడే వారు వెంటనే సంబంధిత పిహెచ్సి డాక్టర్లను సంప్రదించాలని ఇన్చార్జి కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అనంతరం ఆదోని ఏరియా హాస్పిటల్ లో వాంతులు, విరేచనాలతో అడ్మిట్ అయిన సుంకేశ్వరి గ్రామానికి చెందిన నలుగురిని ఇన్చార్జి కలెక్టర్ పరామర్శించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారులు తెలిపారు. ఇన్చార్జి కలెక్టర్ వెంట ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, డిఎంహెచ్ఓ ప్రవీణ్ కుమార్, ఎస్ ఈ ఆర్డబ్ల్యూఎస్ నాగేశ్వరరావు, డిపిఓ నాగరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author