జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని మాంటి ఇంటర్నేషనల్ పాఠశాలలో జిల్లాస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యావేత్త కేవీ సుబ్బారెడ్డి, డాక్టర్ త్రినాథ్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో ప్రతిరోజు తమకు నచ్చిన క్రీడల్లో సాధన చేసి మాటి క్రీడాకారులుగా రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రతిరోజు మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయడం ద్వారా క్రమశిక్షణ అలవాడి ఉత్తమ క్రీడాకారులుగా రాణిస్తారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం కార్యదర్శి నరేంద్ర ఆచారి పాల్గొన్నారు.