జిల్లాస్థాయి చిత్రలేఖన పోటీల గోడ పత్రికల ఆవిష్కరణ … ఆర్యు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: యువత సైన్స్ అండ్ టెక్నాలజీపై అనంతమైన అంతరిక్ష పరిశోధన వైపు దృష్టి సారించాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఎన్ టి కె నాయక్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాస్థాయి చిత్రలేఖన పోటీల గోడ పత్రికలను వైస్ ఛాన్స్లర్ ఎన్ టి కె నాయక్ , రిజిస్ట్రార్ సముద్రాల వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ శ్యామల సరోజినీ, రాయపాటి శ్రీనివాసులు రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సిలర్ ఎన్ టి కె నాయక్ మాట్లాడుతూ చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా ప్రతిఏటా ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డే గా జరుపుకుంటున్నారన్నారు. లయన్స్ జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ జాబిల్లి దక్షిణ ధ్రువం పై భారత త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింపజేసిన ఇస్రో విజయం సాంకేతిక రంగంలో భారత దేశ కీర్తిని పెంపొందింప చేసిందన్నారు. రిజిస్ట్రార్ ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇస్రో సాధించిన ఈ విజయం ప్రపంచ దేశాలన్ని భారతదేశం యొక్క అంతరిక్ష సైన్స్ టెక్నాలజీని అభినందింప చేసిందన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. చిత్ర లేఖన పోటీలు ఈనెల 23న సాయంత్రం నాలుగు గంటలకు సబ్ జూనియర్స్,జూనియర్స్, సీనియర్స్ విభాగాలలో నిర్వహించనున్నామని ఆసక్తి గలవారు వెంకటరమణ కాలనీలో ఉన్న నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు cell 9396861308