జిల్లా స్థాయి పాఠశాల యాజమాన్య కమిటీ శిక్షణ కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రభుత్వ టౌన్ మోడల్ హైస్కూల్ కర్నూలు నందు 28.12.2024 న జరిగినటువంటి జిల్లా స్థాయి పాఠశాల యాజమాన్య కమిటీ శిక్షణ కార్యక్రమానికి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ రవీంద్ర బాబు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శామ్యూల్ పాల్ సందర్శించడం జరిగింది. మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత వారి యొక్క పరిసరాల పరిశుద్ధతను గురించి పాఠశాల స్థాయి నుంచే ఉపాధ్యాయులు తరగతి గదులలో బోధించవలెనని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శామ్యూల్ శిక్షణ పొందుతున్నటువంటి మండల రిసోర్స్ పర్సన్స్ చక్కగా శిక్షణా తరగతులను ఉపయోగించుకొని మండల స్థాయిలో తిరిగి మీరు చక్కగా పాఠశాల యాజమాన్య కమిటీ మెంటర్లకు, ఉపాధ్యాయులకు శిక్షణను అందించవలెనని తద్వారా ఈ శిక్షణ ఫలాలు పాఠశాల స్థాయికి చేరుతాయని, సమాజం మరియు పాఠశాల మమేకమైనప్పుడే పాఠశాల అభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని దీనికి ఈ శిక్షణ తరగతులు చాలా ఉపయోగపడతాయని సూచించారు.28.12.2024 ఉదయం 9 గంటలకు కర్నూలు ఉప విద్యాశాఖ అధికారి గారైన శ్రీ హనుమంతరావు సార్ శిక్షణ తరగతులను ప్రారంభిస్తూ ఈ శిక్షణకు వచ్చినటువంటి మండల రిసోర్స్ పర్సన్స్ చక్కగా వినియోగించుకొని, శ్రద్ధగా విని వీటి యొక్క ఫలాలను మన జిల్లాలోని ప్రతి పాఠశాలకు చేరే విధంగా మీరు వారదులుగా ఉండాలని సూచించడం జరిగింది. ఈ శిక్షణ తరగతులకు 10 మండలాల నుంచి 50 మంది మండల రిసోర్స్ పర్సన్స్, రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందినటువంటి KRP శ్రీ విజయభాస్కర్ మరియు ఐదుగురు జిల్లా రిసోర్స్ పర్సన్స్, కర్నూలు మండల విద్యాశాఖ అధికారులైన శ్రీ వినోద్ , శ్రీమతి విజయకుమార్ మరియు కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ శ్రీ శివశంకర్ హాజరు కావడం జరిగింది.