PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రామ్ కుమార్ ను సన్మానించిన జిల్లా గ్రంథాలయ సిబ్బంది

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ శాఖా గ్రంథాలయంలో విధులు నిర్వర్తించి, పదవి విరమణ పొందిన శాఖ గ్రంధాల అధికారి రామ్ కుమార్ ను శుక్రవారం గ్రంధాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కే కాటన్ ప్రకాష్  ఆధ్వర్యంలో  కార్యాలయ సిబ్బంది గ్రంథాల అధికారి  రామ్ కుమార్ ను శాలువా కప్పి మూమెంటోతో సన్మానించారు. గ్రంథాలయాలకు ఆయన చేసిన సేవలను సిబ్బంది ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సందర్భంగా కార్యదర్శి 37 సంవత్సరాలుగా జిల్లా గ్రంథాల సంస్థలో ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా గ్రంధాల సంస్థ సిబ్బంది సుదర్శన్ మరియు జిల్లా గ్రంథాలయ సిబ్బంద వెంకటేశ్వర్లు మురళి కృష్ణారెడ్డి గోవిందరెడ్డి రమణ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

About Author