జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు.. సిబ్బంది
1 min readఅందరం కలిసికట్టుగా పనిచేసి జిల్లా సమగ్ర అభివృద్ధితోపాటు జిల్లాలో శ్రేయస్సు,ఆనందాన్ని నింపుదాం
ప్రతి జిల్లాఅధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని పిలుపు
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విను బుధవారం స్ధానిక కలెక్టరేట్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, నగర మేయర్ షేక్ నూర్జాహాన్ పెదబాబు దంపతులు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా జిల్లా రెవిన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఆర్డిఓలు అచ్యుత అంబరీష్, ఎం.వి.రమణ, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, ఏపిఈపీడిసిఎల్ ఎస్ఈ పీ.సాల్మన్ రాజు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ భాషా, జిల్లా ఉధ్యానశాఖ అధికారి ఎస్. రామ్మోహన్, ఎపిఎంఐపి పిడి రవికుమార్,నగరపాలక కమీషరు ఎ.భానుప్రతాప్, కాలుష్య నియంత్రణ మండలి ఇఇ వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమలకేంద్రం జిఎం సుబ్రహమణ్యేశ్వరరావు, డి అర్ డి ఎ పిడి అర్.విజయరాజు,ఎల్ డి యం డి.నీలాద్రి,బి.సి. కార్పోరేషన్ ఇడి ఎన్. పుష్పలత, జిల్లా బిసి సంక్షేమ అధికారి ఆర్. నాగరాణి,జిల్లా ఫైర్ ఆఫీసర్ రత్న కుమార్, ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నేరుసు రామారావు మరియు కె సత్యనారాయణ, రాజు, పూడి శ్రీనివాస్, ఏపీ జెఎసి అమరావతి అధ్యక్షులు కె రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బంది,పలు ఉద్యోగ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలిపినవారిలో ఉన్నారు. చాలామంది పూల బుక్కేల బదులు పేద విద్యార్ధులకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లు అందజేసి ఆదర్శప్రాయంగా శుభాకాంక్షలు తెలిపారు. వారందరికి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కృతజ్ఞతలు చెప్పారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేస్తూ జిల్లాలో శ్రేయస్సు, ఆనందాన్ని నింపుదామని పిలుపునిచ్చారు. అదే విధంగా జిల్లా అధికారులందరూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని వచ్చే ఏడాది మోడల్ గ్రామాలుగా ప్రకటించేలా చొరవచూపాలని కోరారు. ఇది మన నూతన సంవత్సర తీర్మానంగా రూపకల్పన చెందాలని అన్నారు.