జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణంరాజు పదవి విరమణ
1 min readజ్ఞాపిక అందజేసి అభినందించిన జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్
శాలువా కప్పి అభినందించిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పి కృష్ణంరాజు ఉద్యోగ విరమణ చేశారు.విధి నిర్వహణలో ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలలోఉన్నతాధికారులకు చేదోడుగా ఉంటూ తన ఉద్యోగ ధర్మాన్ని అంకిత భావంతో కృష్ణంరాజు నిర్వహించేవారు. కృష్ణంరాజు ని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ మెమెంటో ను అందించి ప్రశంసాపత్రంఅంద చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎం సూర్యచంద్రరావు, ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం ఏవో బివిఎస్ఆర్కె నాయక్, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.