పదవి విరమణ పొందిన ఎస్సై , ఏ ఆర్ ఎస్ ఐ లను సన్మానించిన జిల్లా ఎస్పీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు సిబ్బంది పదవి విరమణ పొందడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ అన్నారు.ఈ సంధర్బంగా శనివారం పదవి వీరమణ పొందిన ఎస్సై , ఏ ఆర్ ఎస్ ఐ లను జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శాలువ, పూలమాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.పోలీసుశాఖకు వారు అందించిన సేవలను జిల్లా ఎస్పీ కొనియాడారు.పదవీ విరమణ పొందినవారు..1) కర్నూలు హెడ్ క్వార్టర్ ఎస్సై – ఆర్. శ్రీనివాసులు2) ఆర్ముడు రిజర్వుడ్ ఆర్ ఎస్సై – ఎస్. సమీర్ భాషఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పదవీ విరమణ పొందిన సిబ్బందితో మాట్లాడుతూ…కుటుంబాలతో సంతోషంగా గడపాలని, పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, సిఐ లు ప్రసాద్, శివశంకర్, ఆర్ ఐలు సోమశేఖర్ నాయక్, నారాయణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు.