వట్లూరు టిటిడిసిలో జిల్లా సమైక్య పాలకవర్గ సమావేశం
1 min readజనరల్ బాడీ ఎలక్షన్ నిర్వహణ అధ్యక్ష,కార్యదర్శులుగా
పూసం గంగాభవాని, తోట కృపామణి
యాంకర్ పర్సన్ గా డిఆర్డిఏ పిడి డా:వై విజయరాజు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: జిల్లా సమాఖ్య పాలకవర్గ సమావేశం స్ధానిక వట్లూరు టిటిడిసి లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన సర్వ సభ్య సమావేశములో జనరల్ బాడీ ఎలక్షన్ నిర్వహించారు. ఈ ఈఎన్నికల్లో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలుగా పూసం గంగాభవాని (బుట్టాయిగూడెం మండలం), ఉపాధ్యక్షురాలు గా ఆవుల స్వర్ణ కుమారి (మండవల్లి మండలం), కార్యదర్శి గా తోట కృపామణి, (కొయ్యలగూడెం మండలం), సహాయ కార్యదర్శి గా సయ్యద్ సుల్తానా (ఉంగుటూరు మండలం), కోశాధికారి గా గోళ్ళ శాంత కుమారి (అగిరిపల్లి మండలం) లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశములో ఏలూరు జిల్లాలోని అన్ని మండల సమాఖ్యల ముగ్గురు చొప్పున పాలకవర్గ సభ్యులు, డి.ఆర్.డి.ఏ.పిడి డా.ఆర్.విజయరాజు, జిల్లా యాంకర్ పర్సన్ లు పాల్గొన్నారు.