నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు..
1 min readసమస్యలు వస్తే కమిటీ సభ్యులదే బాధ్యత
ప్రశాంతంగా వినాయకుని పండుగను జరుపుకోండి
ప్రజల మంచిని కోరేవారే పోలీసులు:ఎస్ఐ ఓబులేష్..
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): వినాయకుని పండుగను ప్రతి గ్రామంలో కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని అల్లర్లు సృష్టించాలని చూస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అంతే కాకుండా డీజే లకు టపాకాయలు కాల్చడం వాటికి అనుమతి లేదని ఎస్ఐ హెచ్.ఓబులేష్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సాయంత్రం ఏర్పాటు చేసిన ప్లీస్ కమిటీ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వినాయకుని కమిటీ సభ్యులతో ఎస్సై మాట్లాడారు.పండుగలో చిన్న చిన్న విషయాలకు పెద్దగా చేసుకోవద్దని అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వినాయకుని మండపం దగ్గర విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే వాటిపై ఎస్సై వారికి అవగాహన కల్పించారు.గ్రామాల్లో ఉన్న ప్రతి వినాయకుని దగ్గర ఏమైనా సంఘటన జరిగితే ఆ కమిటీ వారే బాధ్యత వహించాలని అన్నారు.మీ పట్ల పోలీసులు ద్వేషం పెంచుకోరని మీ మంచిని కోరేవారే పోలీసులు అని ఎక్కువ ఆలస్యం చేయకుండా వినాయకుని నిమజ్జనం త్వరగా అయ్యేలా చూడాలని వృధా ఖర్చులు చేసుకోకుండా మంచిగా భోజనాలు చేయిస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారంటూ కమిటీ వారికి ఎస్ఐ సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్బయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.