మోసకారి నాయకుల మాటలు నమ్మకండి
1 min readమంత్రాలయం, చెట్నేహళ్లి లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి , ప్రియాంక రెడ్డి, కుమారి రెడ్డి.
పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన చెట్నేహళ్లి గ్రామస్థులు.
మంత్రాలయం లో జన జాతర.
ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి కి భారీ క్రేన్ సహాయంతో గజమాల వేసి సన్మానించిన పెట్రోలు బంక్ శీనన్న, బొంబాయి శివ.
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు అంటు మాయ మాటలు చెప్పే మోసకారి నాయకుల మాటలు నమ్మకండి అని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని చెట్నేహళ్లి, మంత్రాలయం లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ మహిళా నాయకురాలు ప్రియాంక రెడ్డి, కుమారి రెడ్డి , వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి, కృష్ణా రెడ్డి, లక్మికాంత్ రెడ్డి, సయ్యద్, దశరథ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చెట్నేహళ్లి గ్రామానికి చేరుకున్న వై. బాలనాగిరెడ్డి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. మెయిన్ రోడ్డు, భీరప్ప గుడి, కురువ గేరి మీదుగా రోడ్డు షో నిర్వహించారు. మంత్రాలయం చేరుకున్న ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి కి రాఘవేంద్ర నగర్ లో వైఎస్సార్సీపీ మండల నాయకులు పెట్రోలు బంక్ శీనన్న, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, బొంబాయి శివ నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. పర్యటన జన జాతర గా సాగింది. రాఘవేంద్ర నగర్, రాఘవేంద్ర సర్కిల్, ప్రధాన రహదారి, ఆర్చ్ మీదుగా రోడ్డు షో నిర్వహించారు. అనంతరం రాఘవేంద్ర సర్కిల్ లో పెట్రోలు బంక్ శీనన్న, బొంబాయి శివ ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్ తో గజమాల వేసి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి మాట్లాడుతూ దేవుళ్ళ, నా నియోజకవర్గంలోని ప్రజల ఆశీస్సులు ఉన్నంత సేపు భయపడే ప్రసక్తే లేదు. నాకు మూడు సార్లు ఎమ్మెల్యే పదవి వచ్చింది అంటే అది మీరు పెట్టిన బిక్ష అని గర్వంగా చెప్పారు. నాల్గవ సారీ కూడా మీ అందరి బిక్షతో ఎమ్మెల్యే కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంత్రాలయం లో అశోక్ రెడ్డి అంత మోసం చేసి ఇప్పుడు ఆ పార్టీ లోకి వెళ్లాడని అక్కడ కూడా మోసం చేయడం ఖాయమని హెచ్చరించారు. మంత్రాలయం లో చాలా మంది కి ఇళ్ల స్థలాలు రాలేదని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16 ఎకరాలు భూమి ని కొనుగోలు చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి జరగలేదని మాట్లాడుతున్న టీడీపీ నాయకులకు ఒక్కటే చెబుతున్నా అవును 15 సంవత్సరాల ఎమ్మెల్యే గా ఉన్న మాట వాస్తవమే కానీ రెండు సార్లు ప్రతిపక్షంలో ఉన్నాం. 2019 లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా కారణంగా రెండు సంవత్సరాలు అభివృద్ధి కుంటు పడింది. మిగతా మూడేళ్ళలో చేయగలిగిన వరకు అభివృద్ధి చేశాం. మరలా అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. సూపర్ సిక్స్ కాదు బ్యాటింగ్ జగన్, బౌలింగ్ చంద్రబాబు జగన్ బ్యాటింగ్ దెబ్బ కు కూటమి గల్లంతు కావడం ఖాయమన్నారు. సోమవారం జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి ఎంపీ గా బీవై రామయ్య ను, ఎమ్మెల్యే గా మీ అభిమాన నాయకుడు వై. బాలనాగిరెడ్డి ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, సచివాలయ కో కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి, సర్పంచ్ అంజిని, ఉప సర్పంచ్ లు హోటల్ పరమేష్, వీరనాగప్ప ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి, రామాంజనేయులు, అల్లింగప్ప, ముఖ్య నాయకులు, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అన్ని కులాల వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.