ప్రమాదాలలో ప్రాణాలు పోతున్న పట్టించుకోరా..
1 min readఎన్ హెచ్ ఏఐ అధికారుల తీరులపై ప్రజా ప్రతినిధుల ఆగ్రహం
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కడప -కర్నూలు జాతీయ రహదారి చెన్నూరు కొత్త రోడ్డు అదేవిధంగా చెన్నూరు హైవే గోసుల కళ్యాణ మండపం వద్ద ఎన్నో ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు, మరి కొంతమంది వికలాంగులుగా మిగిలిపోయారే తప్ప అక్కడ పనులను జాతీయ రహదారి అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని, ఇలా ఎన్నోసార్లు ప్రతినిధులు, అధికారులు నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నేషనల్ హైవే అధికారులు ఎలాంటి పనులు చేపట్టకపోవడం బాధాకరమని ఇలాగే కొనసాగితే పార్టీలకతీతంగా నేషనల్ హైవే అధికారుల తీరుపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయక తప్పదని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో మండల అధికారుల తీరుపై ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు, మండలంలోని కనపర్తి లే అవుట్ లలో నిర్వహిస్తున్న జగనన్న గృహ నిర్మాణాలు ఎంతవరకు పూర్తయ్యాయి, ఇంకా ఎందుకు అక్కడ పనులు జాప్యంగా జరుగుతున్నాయి వంటి వాటిపై హౌసింగ్ ఏఈ ని ప్రజా ప్రతినిధులు ప్రశ్నించారు. అదేవిధంగా కనపర్తి లేఅవుట్లలో ఇండ్లు ఇండ్ల స్థలాలు కేటాయించినప్పటికీ కొంతమంది ప్రజలు అక్కడికి తాము వెళ్ళమని కరాకండిగా చెప్పారని అలాంటి వారి పేర్లను తొలగించినప్పటికీ. వారు మరల గృహ నిర్మాణాన్ని చేపట్టేందుకు అర్హత కల్పించకపోవడానికి గల కారణం తెలపాలన్నారు. అలాగే రెవిన్యూ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, కర్నూలు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇల్లు ఇళ్ల స్థలాలు కోల్పోయిన బాధితులకు అరకొర నిధులు ఇచ్చి వారి ఇంటి స్థలాలను, ఇండ్లను జాతీయ రహదారికి తీసుకోవడం జరిగిందన్నారు. అయితే ఇప్పటికీ కూడా వారి సమస్యలు తీర్చక పోవడానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా వారికి ఇంటి స్థలాలు అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తాం అంటూ కాలయాపన చేయడం ఎంతవరకు సబబు అని వారు రెవెన్యూ అధికారులు తీరులపై మండిపడ్డారు. దీనిపై డిప్యూటీ తాసిల్దార్ వెంకటరమణ స్పందిస్తూ నేషనల్ హైవే బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని త్వరలోనే వారికి ఇంటి స్థలాలు కేటాయించడం జరుగుతుందని సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. కేసీ కెనాల్ కు సంబంధించిన స్థలాలను కొంతమంది ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని దీనిపై నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని అక్రమ కట్టడాలను పూలదొచ్చేదానికి, మాకు అధికారం లేదు,అది గ్రామపంచాయతీ అధికారులకు సంబంధమని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పడం జరుగుతుందని, గ్రామపంచాయతీ అధికారులను అడిగితే దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని వారు చెబుతున్నారని, అయితే దీనికి ఎవరు సంబంధమో తెలపాలని ఈ సమస్యను ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపై స్పందించిన అధికారులు త్వరలోనే ఈ సమస్యను పై అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. మండల సమావేశంలో చివరగా నేషనల్ హైవే అధికారులు చెన్నూరు కొత్త రోడ్డు వద్ద ఉన్న సమస్యలను బస్ షెల్టర్, డ్రైనేజీ సమస్య, సర్వీస్ రోడ్ల నిర్మాణాలు వీలైనంత త్వరగా చేపట్టకపోతే ప్రజా ప్రతినిధులు, అధికారులతో సహా ఆందోళన బాట కట్టక తప్పదని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, సాగునీటి సంఘం అధ్యక్షులు తాడిగొట్ల వెంకటసుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్. ఈ ఓ పి ఆర్ డి సురేష్ బాబు, ఏఈ మల్లికార్జున, హౌసింగ్ ఏఈ మెనీల్, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ బి చెన్నారెడ్డి, ఏవో శ్రీదేవి, ఎంఈఓ గంగిరెడ్డి, పశువైద్యాధికారి ఉపేంద్ర, ఏపీఓ శైలజ, కార్యదర్శులు ,ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.