రోడ్డు పనులలో ఎక్కడ రాజీ పడవద్దు
1 min readనిర్మాణం పూర్తయిన రోడ్డు పనులను,నాణ్యత పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె .వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతలో రాజీ పడకుండా త్వరితగతిని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె .వెట్రి సెల్వి ఆదేశించారు. బుధవారం దెందులూరు మండలం శ్రీరామవరం రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నాణ్యత, పొడవు, వెడల్పు, అంచనా ఖర్చు వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీరామవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి సోము బ్రహ్మం కలిసి కలెక్టర్ రోడ్లు నిర్మాణ పనులపై ఆరా తీశారు. పల్లంగా ఉన్నందున కొంత మేరకు సిసి రోడ్లు పది రోజుల్లో పూర్తి చేస్తారని తెలిపారు. ఈ గ్రామం నుంచి తొమ్మిది కిలోమీటర్ల మేర రోడ్డు రిపేరు పనులు కొనసాగిస్తున్నామని ఆర్ అండ్ బి ఎస్ఈ జాన్ మోషే కలెక్టర్ కు వివరించారు. రోడ్డుకు డ్రైనేజీ ఏర్పాట్లకు కొంతమేరకు స్థలాన్ని వదులుతున్నారు లేదా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గతంలో రోడ్డు పరిస్థితి రోడ్డు రిపేర్ చేసిన తర్వాత ఉన్న పరిస్థితి కి సంబంధించిన ఫోటోలను అందజేయాలని చెప్పారు.కలెక్టర్ వెంట ఆర్ అండ్ బి అధికారులు , వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నారు.