ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించరాదు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: బాల సాయి కంటి వైద్యశాల, సందీప్ క్లినిక్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో జంపాల శివయ్య నగర్ లో నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరం ప్రారంభ కార్యక్రమంలో లయన్ డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ శరీరంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నేత్రాలను తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి అన్నారు.జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రంగనాయకులు మాట్లాడుతూ పేదలకు వైద్య సదుపాయాలను అందజేయాలన్న ఉద్దేశంతో స్లమ్ ఏరియాలో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. రిటైర్డ్ విశ్వ భారతి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ డయాబెటిస్, బీపీ లపై అవగాహన కల్పించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్స్ జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యం కొరకు అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం అవయవదానంపై అవగాహన కల్పించే పోస్టర్ల ద్వారా ఏ అవయవాలు దానం చేయొచ్చు ఎలా దానం చేయాలి అనే దానిపైన అవగాహన కల్పించారు. శ్రీ మల్లిక్ మెడికల్ స్టోర్స్ యజమాని రాకేష్ గౌడ్ ఆధ్వర్యంలో అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో డి.విచంద్ర ,రాజశేఖర్ గౌడ్ ,ఏ రాజు ,మౌలాలి ,వెంకటేష్, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు .కంటి పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా కంటి అర్థాలు పంపిణీ చేశారు. 100 మందికి పైగా ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు.