PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలను జయప్రదం చేయండి

1 min read

మునెప్ప ఏఐటియుసి జిల్లా కార్యదర్శి

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పట్టణంలో విశాఖపట్నంలో సెప్టెంబర్ ఒకటే రెండు మూడు తేదీల్లో జరగబోయే ఏఐటియుసి జాతీయ సమితి సమ్మేళనాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మునేప్ప తెలిపారు. అనంతరం సిపిఐ కార్యాలయంలో ఏఐటీయూసీ ముఖ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తాలూకా అధ్యక్షుడు వీరేష్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్. మునెప్ప మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వాణిజ్య రాజధాని ముంబై నగరంలో 1920 అక్టోబర్ 31న అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) ఆవిర్భవించిందనీ. బ్రిటి సామ్రాజవాదులను దేశ పొలిమేరల నుండి తరిమి కొట్టి స్వాతంత్ర సంఘమానికి రక్త మాంసాలు సమకూర్చడంలో కార్మిక వర్గాన్ని ఏకం చేసి ఐక్యంగా నడపడానికి ఏర్పడినటువంటి మొట్టమొదటి కేంద్ర కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఆయన తెలిపారు. 2023 డిసెంబర్ 8 నుండి 2024 జనవరి 22 వరకు దాదాపు 42 రోజులకు 1,6, అంగన్వాడీలు డిసెంబర్ 22 నుండి జనవరి 8 వరకు 45 వేల మంది మున్సిపల్ కార్మికులు విరోచక పోరాటం సాగించారని, ప్రభుత్వం నిర్బంధాలను ఏ స్మాల్ కలదని సమ్మె చేశారని ఈ సమయంలో ఏఐటీయూసీ క్రియాశీలక పాత్ర పోషించడం జరిగిందని వారు తెలిపారు. ఇంతటి చరిత్ర పోరాట వారసత్వం కలిగిన ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనాలు 2024 సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో రాష్ట్ర ఆర్థిక రాజధాని సంఘటిత కార్మిక వర్గం కేంద్రమైన విశాఖపట్నంలో జరుగుతున్నాయని ఈ సమ్మేళనాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర పాలిత రాష్ట్రాల నుండి 500 మంది ప్రజాప్రతినిధుల హాజరవుతున్నారని వారు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఎల్పిజి విధానాలు అమలు జరుపుతున్న ఫలితంగా కార్పొరేట్ బడా శ్రామిక వర్గం రాజమలుతుందని పని భద్రత కరువైంది త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలన్నీ చొట్ట బండలై పోతున్నాయని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ రోజు వారి కూలి విధానాలు అతి కర్షకంగా అమలు జరుగుతున్నాయని మెరుగైన వేతనాలు పెన్షన్ విద్యా వైద్య సౌకర్యాలు మృగమైపోతున్నాయి కోట్లాదిమంది అసంఘటిత రంగ కార్మికులు ప్రభుత్వ స్కీం ఉద్యోగులను కట్టు బానిసలుగా మారుస్తున్నారని సంఘం పెట్టుకునే హక్కు తిరస్కరించబడింది సమ్మె హక్కు కాలు రాయబడిందని 73వ షెడ్యూల్ ఎంప్లాయిస్మెంట్లో గత పది సంవత్సరాలుగా వేతనాలు పెంచడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశీ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఆధునిక దేవాలయాలుగా కీర్తించబడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ధ్వంసం చేస్తున్నారని ప్రైవేట్ కార్పొరేట్ బడా పారిశ్రామిక వేతలకు వీటిని అప్పుగిస్తున్నారని బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ టెలికం రైల్వే అన్నిటిలో విదేశీయ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారని ఇలాంటి తరుణంలో కార్మికులు సంఘటితరంగా పోరాటాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరంజాతీయ సమితి సమ్మేళనాల పోస్టర్లు విడుదల. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి కె. తిమ్మగురుడు, విద్యుత్ మీటర్ రీడర్స్ నాయకులు నరసింహులు, వీరాంజిగౌడ్ దాదావలి వీరేష్,లక్ష్మన్న,నాయుడు, వీరేష్,కాజా, విజయ్, వీరేంద్ర,శివ,మల్లికార్జున గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

About Author