PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిధులు అడిగే దమ్ము ధైర్యం లేదా..

1 min read

గత రాక్షస పాలనలో అందరూ బాధితులే

నిర్వీర్యమైన గ్రామాలకు కూటమి జవసత్వాలు

రాజకీయాల కతీతంగా అభివృద్ధి

మండల సమావేశంలో ఎమ్మెల్యే జయసూర్య..

దర్జాగా సమావేశ హాల్లోకి బయటి వ్యక్తులు..

పల్లెవెలుగు  వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): గత ప్రభుత్వ హయాంలో మా నిధులు మాకు కావాలని అప్పుడు అడిగే దమ్ము ధైర్యం ఎవరికీ లేదా అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.సోమవారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో 11:55 ని. లకు ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.ముందుగా ఎంపీడీఓ దశరథ రామయ్య మండల అధికారులతో ప్రగతి నివేదికలను వినిపించారు.ఈ సమావేశంలో నలుగురు సర్పంచులు మాత్రమే సమస్యల గురించి మాట్లాడారు.బైరాపురంలో జగనన్న కాలనీలో విద్యుత్ స్తంభాలు కావాలని గత మూడేళ్లుగా అడుగుతున్నా పరిష్కారం కావడం లేదని గ్రామ సర్పంచ్ ఫణి భూషణ్ రెడ్డి అన్నారు.పశువైద్య కేంద్రంలో సిబ్బంది లేకపోవడంతో రైతులు ఫీవర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి సర్పంచ్ వెంకటరామిరెడ్డి తీసుకువచ్చారు.గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారని తలముడిపి సర్పంచ్ వెంకటేశ్వర్లు అన్నారు. మైనారిటీ కాలనీలో డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో రోడ్డుపైనే మురుగు నీరు వస్తుందని డ్రైనేజీ కాలువలు  ఏర్పాటు చేయాలని కడుమూరు సర్పంచ్ జీవరత్నం అన్నారు.తర్వాత ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో తన స్వలాభం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అభివృద్ధి లేదు రాక్షస పాలనలో అందరూ బాధితులే..ప్రజా ప్రతినిధులు అందరూ అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారని నాడు-నేడు ఉపాధ్యాయులకు శాపంగా ఉండేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో సిమెంట్ రోడ్లతో అభివృద్ధి చేస్తున్నాం.నిర్వీర్యమైన గ్రామాలకు జవసత్వాలు తీసుకువచ్చేందుకు సీఎం, డిప్యూటీ సీఎం ఉన్నారని సర్పంచుల బాధ ఏంటో మాకు తెలుసు ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీల్లో నిధులు వేయడం జరిగిందని గ్రామాల అభివృద్ధికి సర్పంచుల తీర్మానం చేయండి అభివృద్ధి చేసే బాధ్యత నాది అనిఎమ్మెల్యే అన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం గ్రామాలను అభివృద్ధి చేస్తూ ఉంటే పని పాట లేని వాళ్ళు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.మిడుతూరు బస్టాండ్ నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు మరియు పీరు సాహెబ్ పేట రోడ్డు, మిడుతూరు నుండి చౌటుకూరు-ఓర్వకల్లు రోడ్డుకు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో రైతులను పట్టించుకోలేదు.ఈ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని జలకనూరు మద్దిగుండం చెరువుకు నీళ్లు లీకు కాకుండా షెల్టర్స్ ఏర్పాటు చేయాలన్నారు. అంగన్వాడీ సిబ్బంది 8:30 విధుల్లో ఉండాలని ఎమ్మెల్యే అంగన్వాడీ సీడీపీఓ కోటేశ్వరమ్మకు సూచించారు. మండల సమావేశంలో మండల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు మాత్రమే ఉండాలి కానీ బయటి వ్యక్తులు కూడా సమావేశ హాల్లోకి ప్రవేశించి కుర్చీల్లో దర్జాగా కూర్చున్నారు.వీరిని బయటకు పంపించాలనే తలంపు అధికారులకు ఎవ్వరికీ తట్టలేదేమో..ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు,ఏఓ పీరు నాయక్,ఏఈలు ప్రతాప్ రెడ్డి, విశ్వనాథ్,క్రాంతి కుమార్, మనోధర్,ఏపీవో జయంతి, ఏపీఎం సుబ్బయ్య,ఎంఈఓ లు,అంగన్ వాడీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *