జన్మ భూమి కమిటీల ద్వారా ప్రజలను దోచుకునే చంద్రబాబు కావాలా..?
1 min readసచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమం ఫలాలు అందించే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాల..?
ప్రతి ఇంటిలో సంక్షేమం, అభివృద్ధి, మంచి జరిగిందంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి
ఏలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జన్మభూమి కమిటీ ఏదో ద్వారా ప్రజల దోచుకున్న చంద్రబాబునాయుడు కావాలా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమం అందించే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన కావాలా,తేల్చుకొని, పేదలకు సంక్షేమం ద్వారా అభివృద్ధి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి అందరూ అండగా నిలవాలని మాజీ ఉప ముఖ్య మంత్రి, వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని పిలుపు నిచ్చారు. శుక్రవారం ఎమ్. ఎల్. ఏ. క్యాంప్ కార్యాలయంలో స్థానిక 1వ డివిజన్ కార్పొరేటర్ అరేపల్లి రాధిక సత్తిబాబు దంపతుల ఆధ్వర్యంలో 200 మంది తెలుగుదేశం పార్టీని వీడి ఆళ్ల నాని సమక్షంలో వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పార్టీ లో చేరిన పామర్తి సాయి, తాత నటరాజు, పామర్తి సుధీర్, తాత రంగబాబు, అరేపల్లి ప్రకాష్, కర్రి ప్రకాష్, వీరంకి సత్యనారాయణ, బాలు తదితరులకు ఆళ్ల నాని పార్టీ ఖండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. మరొక కార్యక్రమం లో ఈమధ్యనే టీ.డి. పి. కార్యకర్తలు ప్రలోభ పెట్టి, బలవంతంగా నారా లోకేష్ తో టీ.డి.పి. ఖండువా కప్పిన కొత్తపల్లి గంగాధరరావు ఆళ్ల నాని ప్రజాదరణ చూసి తిరిగి వై. ఎస్. ఆర్. పార్టీలో చేరారు. అలాగే టీ. డి. పి కార్యకర్త శ్యాం రాష్ట్ర బి. సి. సెల్ ప్రధాన కార్యదర్శి కిలాడీ దుర్గారావు ఆధ్వర్యంలో ఆళ్ల నాని సమక్షంలో వై. ఎస్. ఆర్. సి. పి. లో చేరారు. ఈ కార్యక్రమం లో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏ. ఎమ్. సి. మాజీ చైర్మన్ మంచెం మైబాబు, జిల్లా జె. ఏ. లో . కన్వీనర్ వై.ఎన్. వి. శివరావు పాల్గొన్నారు అని మీడియా కో-ఆర్డినేటర్ కోలా భాస్కరరావు ప్రకటనలో తెలిపారు.