పాఠశాలకు డాక్టర్ పది లక్షల విరాళం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తరిగోపుల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల భోజన వసతి కోసం పది లక్షల రూపాయలు డాక్టర్ బి. రవీంద్రబాబు వారి తండ్రి బి. రామకృష్ణ మూర్తి జ్ఞాపకార్థం భోజన శాల మరియు రీడింగ్ గది నిర్మాణానికి గాను నగదును అందజేశారు.వీటి గదులకు డాక్టర్ రవీంద్రబాబు భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమానికి బి.సాయివాణి, వారి తల్లి జానకమ్మ వారి సంతానం ఆరుణ్య,శని ష న్ముక హాజరయ్యారు. గ్రామపెద్దలు మాజీ సర్పంచ్ మందడి నారాయణరెడ్డి, నాగార్జున రెడ్డి,మహేశ్వరరెడ్డి, సర్పంచ్ అంజనమ్మ,లక్మన్న గ్రామ నాయకులు విద్యార్థులు హాజరై వారు హర్షం వ్యక్తం చేశారు.ప్రధానోపాధ్యాయులు కే.సుధాకర్ మరియు ఉపాధ్యాయ బృందం కృష్ణ కుమార్,శివన్న,విజయ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.