PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

థెరిసా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి నక్క ప్రవీణ్ కుమార్ కి డాక్టరేట్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు:  నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సింగరాజు పల్లి గ్రామానికి చెందిన నక్క సత్యాలు యేసు రత్నమ్మ దంపతుల కుమారుడు నక్క ప్రవీణ్ కుమార్ ఆత్మకూరు పట్టణంలోని థెరిసా జూనియర్ కళాశాలలో 2012-2014 సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేశాడు అలాగే శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో 2014- 2017 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేశాడు భౌతిక శాస్త్రంలో ప్రొఫెసర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పరిశోధన చేయడంతో అతి తక్కువ సమయంలోనే  భౌతిక శాస్త్ర విభాగంలో జింకు ఫాస్పాయిడ్ పలుచన అయస్కాంత సెమీ కండక్టర్ల విశ్లేషణ-X(X= ఇనుము, నీకేల్ మరియు మ్యాంగనీస్) గది ఉష్ణోగ్రత ఫైరో అయస్కాంతత్వం కోసం వ్యవస్థ అనే అంశంపై పరిశోధన చేశాడు ఈ విభాగంలో VIT-AP యూనివర్సిటీ అధికారులు ప్రవీణ్ కుమార్ కు డాక్టరేట్ పట్టాను పొందినట్లు వెల్లడించారు. ప్రవీణ్ మాట్లాడుతూ నా చదువులో థెరిసా జూనియర్ కళాశాల చాలా ప్రముఖ పాత్ర పోషించాయి అని, అలాగే నా ఆశయం పేదపిల్లల చదువు కోసం ఒక చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపిస్తాను అని తెలియచేశారు.ఈ నక్కా ప్రవీణ్ కుమార్ ను ఆత్మకూరు పట్టణంలోని థెరిసా  జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ వసుంధర అకాడమిక్ డైరెక్టర్ సాయి ప్రణీత్,ప్రిన్సిపల్ హరికృష్ణ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాళశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

About Author