ప్రాణం పోసే డాక్టర్లను – ప్రాణం తీయడం హేయమైన చర్య
1 min read– అమానుష మైన ఘటనపై దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలి
– సిహెచ్ సి, పిహెచ్ సి వైద్యులు నిరసన ర్యాలీ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ప్రాణం పోసే డాక్టర్ల పై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ప్రాణం తీయడం దారుణమని అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని పీ హెచ్ సి, సిహెచ్ సి వైద్యులు ,వైద్య సిబ్బంది శనివారం చెన్నూరులో మానవహారం నిర్వహించి, ర్యాలీ చేపట్టారు, ఈ సందర్భంగా పిహెచ్ సి వైద్యులు డాక్టర్ బి. చెన్నారెడ్డి మాట్లాడుతూ, కలకత్తాలోని ఓ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ ను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను వెంటనే శిక్షించాలని వైద్యులు డిమాండ్ చేశారు, వైద్యుడు ఒక దేవుడు లాంటి వాడని ప్రాణం పోయడమే తప్ప, ప్రాణం తీయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక వైద్యుడేనని అలాంటి వైద్యురాలిని అమానుషంగా అత్యాచారం చేసి ప్రాణాలు తీయడం సభ్య సమాజం తలదించుకునే విధంగా చేసిన అలాంటి క్రూరులను, దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని వారు తెలిపారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలపై ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించకపోతే ఇలాంటి వారితో మానవ మనుగడకే ప్రమాదకంగా మారే అవకాశం ఎంతైనా ఉందని వారు తెలిపారు, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సరియైన శిక్షలు అమలు పరచాలని వారు డిమాండ్ చేశారు, భాదితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని .ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై తొందరగా విచారణ జరిగిపించి,దోషులకు కఠినంగా శిక్షించాలి . వైద్య ఆరోగ్యశాఖ లో పని చేస్తున్న డాక్టర్స్ కి స్టాఫ్ అందరికి ప్రభుత్వం భద్రత కల్పించాలని వారు నిరసన ర్యాలీలో నినాదాలు చేశారు, ఈ కార్యక్రమం లో , డాక్టర్ వంశీ కృష్ణ , డాక్టర్ సాగర కుమారి, డాక్టర్ హరీష్, డాక్టర్ శివ శంకర్, డాక్టర్ శిరీష, డాక్టర్ ఇర్షాద్, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ వజిహా , పి హెచ్ సి & సి హెచ్ సి వైద్య సిబ్బంది , ఆశా వర్కర్లు పాల్గొన్నారు.