PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాపై పోటీ చేసి గెలిచే దమ్ము గుమ్మనూరు కు ఉందా

1 min read

నా ప్రజల దేవుళ్లు ఆశీస్సులు ఉన్నంత వరకు నాదే గెలుపు

సీఐడి దర్యాప్తు కు ఎల్లప్పుడూ నేను సిద్ధం

జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ మంచి చేశాం

చంద్రబాబు పాలనలో వైకాపా శ్రేణుల పై దాడులు చేస్తున్నారు

 నాయకులు, కార్యకర్తల భయపడకండి ధైర్యంగా ఉండండి

కార్యకర్తల సమావేశంలో  వై. సీతారామిరెడ్డి  తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి 

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  మంత్రాలయం నియోజకవర్గం లో నాపై పోటి చేసి గెలిచే దమ్ము గుమ్మనూరు జయరాం కు ఉందా అని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో  మండలంలోని వైకాపా ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు, ముఖ్య నాయకులతో  వై. సీతారామి రెడ్డి అధ్యక్షతన వైకాపా నాయకులు జి. భీమారెడ్డి, సి. వి. విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం టీడీపీ అభ్యర్థులు గెలిస్తే నా నియోజకవర్గంలోని దేవుళ్లు, ప్రజలు, మీ అందరి ఆశీస్సులతో నాల్గవ సారీ ఎమ్మెల్యే గా గెలిపించినందుకు మీ అందరికీ రుణ పడి ఉంటానని ఇదే అప్యాయత, ప్రేమ మా కుటుంబ సభ్యుల పై కూడా చూపాలని కోరారు. నా ప్రజల దేవుళ్లు ఉన్నంత వరకు గెలుపు నాదే అని నాపై ఎవరు పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని అన్నారు. ప్రతి పక్షం మాకు కొత్త కాదన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా టీడీపీ నాయకుల పై దాడులు చేయలేదని వివరించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లను టార్గెట్ చేసి మళ్ళీ తొలగించాలని ప్రయత్నిస్తున్నారని నేను ఉన్నంత సేపు రెగ్యులర్ రేషన్ డీలర్లు ఎవరూ కూడా అధైర్య పడొద్దని మీ పైన ఎవరైనా దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మాలపల్లి గురురాజరావు స్వామి ని మన పార్టీ అడ్వకేట్ గా నియమించడం జరిగిందని మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే స్వామి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మొన్న అలంపూర్ లో జరిగిన సమావేశంలో గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ మా సోదరుడు వై. వెంకట్రామిరెడ్డి, వై. సాయిప్రసాద్ రెడ్డి ని ఓడించాను ఒక్కటి మాత్రమే మిస్ అయిందని విమర్శిస్తున్నాడు కదా ఇప్పటికైన మించిది ఏమి లేదు. 2029లో గుమ్మనూరు జయరాం కు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే మంత్రాలయం నియోజకవర్గం లో నా పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. వైకాపా హయాంలో ఆలూరు నియోజకవర్గంలో సంపాదించుకుని గుంతకల్లు నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు పెట్టి గెలవడం కాదు. రా మంత్రాలయం నియోజకవర్గం లో వచ్చి పోటీ చేయి  నా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నంత సేపు తాటాకు చప్పట్లకు భయపడేది లేదన్నారు. కోసిగి లో ముత్తురెడ్డి నా పైన సీఐడి దర్యాప్తు చేయాలని కోరాడు కదా నేను సిద్ధం ముత్తురెడ్డి ఎప్పుడు విచారణ చేసిన పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానన్నారు. నీలాగా రైలులో నేరేడు పండ్లు అమ్మ లేదని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఊరు వదిలి వెళ్లలేదని మండిపడ్డారు.   వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి హయాంలో అందరికీ మంచి చేశారు కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో వైకాపా శ్రేణులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి పైనే దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.  హత్యలు, అత్యాచారాలు, దోపిడీ లకు పాల్పడుతున్నారని విమర్శించారు. కావున ఇప్పటికైనా మించిది లేదు మీరు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయండి, విచారణ పేరుతో వృద్ధులకు అందే పెన్షన్లు తొలగించాలని చూడటం చాలా దారుణమన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకోవాలని ఆ రోజుల్లో నాయకులు, కార్యకర్తలకు ఏమి చేయకపోయారని అయినా ఇప్పటికీ కూడా అందరూ ధైర్యంగా జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని తెలిపారు. మరో 4 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, 5వ సారీ ఎమ్మెల్యే గా నేను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో వైకాపా సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author