శుభకార్యానికి ఆర్థిక సహాయం అందజేత
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని నజీర్ బిగ్ పల్లె గ్రామానికి చెందిన ముద్దల బాలమ్మ, జయరాముడు కుమారుని వివాహా శుభకార్యామని ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయాలని గురువారం వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మ రాజేంద్రప్రసాద్ రెడ్డి దృష్టికి ఓబులంపల్లె వైఎస్ఆర్ సీపీ నాయకులు చల్ల వెంకటసుబ్బారెడ్డి తీసుకెళ్లగా, గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి వెంటనే స్పందించి కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ముద్దుల బాలమ్మ, జయ రాముడు కుటుంబానికి 5 వేల రూపాయలు గురువారం అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా బాలమ్మ ,జయరాములు గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.