PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీజీహెచ్​ కు కోటి 40 లక్షల రూ విరాళం ఇవ్వనున్న  ప్రవాస భారతీయ పూర్వ విద్యార్ధులు

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి   మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పలు విభాగాల అభివృద్ధికి అమెరికాలో సెటిల్ అయిన ప్రవాస భారతీయులు  ఆసుపత్రి అభివృద్ధికి తోడ్పాటుకు నిన్న రాత్రి జూమ్ మీటింగ్ లో ప్రవాస భారతీయులు తో మాట్లాడి ఆసుపత్రికి కావాల్సిన అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారలు కావాలనిసూపరింటెండెంటు అభ్యర్ధించారు. అడిగిన వెంటనే దానికి వారు సానుకూలంగా స్పందిస్తూ ముందుకొచ్చినట్లు తెలిపారు.. అనంతరం GGH కోటి 40 లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు.డాక్టర్ సోమసుందరము  ఆసుపత్రికి కోటి రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు.  ఆసుపత్రికి కావలసిన వైద్య పరికరాలు గైనిక్, పిల్లల వార్డు మరియు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోకి అత్యవసర చికిత్స లో రోగనిర్ధారణ చేసేందుకు అల్ట్రాసౌండ్ ఇతర వైద్య పరికరాలు ఇవ్వడానికి డాక్టర్ కృష్ణారెడ్డి  ముందుకు వచ్చినట్లు తెలిపారు.డాక్టర్ కృష్ణారెడ్డి 1962 బ్యాచ్  యూఎస్ఏ లో సెటిల్ అయిన పూర్వ విద్యార్ధి..30 లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఆసుపత్రిలే వైద్య పరికరాల కొరకు అల్ట్రా సౌండ్ మిషన్లు మరియు  ఇఎన్టి విభాగానికి ఎండోస్కోపీ పరికరాలు ఇస్తామన్నారు. KMC-ANA గ్రూప్ వారు 5 లక్షల రూపాయలు KMC గ్రాడ్యుయేట్ ట్రస్టు ద్వారా ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు.ఈ జూమ్ మీటింగ్లో డాక్టర్ కొప్పర్తి రామ్మోహన్  అరేంజ్ చేశారు.. డాక్టర్ సదాశివ రెడ్డి  డాక్టర్ రంగారెడ్డి  మరియు డాక్టర్ అనుపమ దీనిని కోఆర్డినేట్ చేశారు.. ఈ పరికరాలు స్పెసిఫికేషన్ కొరకు HOD లతో మీటింగ్ జరిపారు.. చిన్నపిల్లల విభాగపు హెచ్ ఓ డి, డా.విజయ ఆనంద్ బాబు, గైనిక్ హెచ్ ఓ డి, డా.శ్రీలక్ష్మి , డా.సావిత్రి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి, డా.రామ్ శివ నాయక్, పీడియాట్రిక్ విభాగపు వైద్యులు డా.శారద, డా.రవీంద్రారెడ్డి, ARMO, డా.వెంకటరమణ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, తెలిపారు.

About Author