50 మంది సిఆర్ఆర్ కళాశాల విద్యార్థులు రక్తదానం
1 min readరెడ్ క్రాస్ సొసైటీ, లైన్స్ క్లబ్ ఆఫ్ హేలాపురి ఆధ్వర్యంలో కార్యక్రమం
విద్యార్థులను అభినందించిన రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి
చదువుతోపాటు సామాజిక సేవలో విద్యార్థులు పాల్గొనాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ హేలపూరి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక సి ఆర్ ఆర్ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 50 మంది విద్యార్థులు రక్తదానం చేశారని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన విద్యార్థులకు కృష్ణారెడ్డి అభినందనలు తెలిపారు. సి ఆర్ ఆర్ పీజీ కళాశాల కరస్పాండెంట్ కానాల శ్రీనివాస్ మాట్లాడుతూ రక్తదానం చేయడంలో సి ఆర్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ముందుంటారని ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తారని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కే వరప్రసాదరావు, సి ఆర్ ఆర్ పి జి కళాశాల కరస్పాండెంట్ కానాల శ్రీనివాస్, డైరెక్టర్ సతీష్ బాబు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామరాజు, లైన్స్ క్లబ్ ఆఫ్ హేలపురి ప్రెసిడెంట్ పి వి రమణ, కార్యదర్శి సురేష్, పిఆర్ఓ కె.వి రమణ తదితరులు పాల్గొన్నారు.