రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదానం చేసినట్లే
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రక్త దాతలు ప్రాణదాతలతో సమానమని ఎల్ .పి. జి టెరిటరీ మేనేజర్ తుషార్ జగతాబ్ అన్నారు. భారత్ పెట్రోలియం లిమిటెడ్ రీజనల్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సిబ్బందిచే రక్తదాన శిబిరాన్ని నేడు ఎల్ .పి .జి రీజినల్ గ్యాస్ ఫిల్లింగ్ ప్లాంట్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించారు. భారత్ పెట్రోలియం లిమిటెడ్ ఎల్ .పి జి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ రీజినల్ కార్యాలయం, బాల సాయి కంటి ఆసుపత్రి, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ,సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్లు సంయుక్తంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జరిగిన ఈ రక్తదాన శిబిర ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు జిల్లా చైర్మన్ కే.జీ గోవిందరెడ్డి పాల్గొని మాట్లాడుతూ దాత బరువు కనీసం 50 కిలోలు కలిగి ఉండి 12 గ్రాముల పైబడిన హిమోగ్లోబిన్ కలిగి ఉండి 18 నుంచి 60 సంవత్సరాలలోపు వారు ఎవరైనా రక్తదానానికి ముందుకు రావచ్చు అన్నారు. లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ మాజీ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్త గ్రూపును తెలియజేసే ఐడిని తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలని అత్యవసర పరిస్థితులలో దాని ఆవశ్యకత ఉంటుందన్నారు. మూఢనమ్మకాలను వదిలి అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు యువత నడవాలని రక్తదాన ఆవశ్యకతను అందరికీ తెలియజేసేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న లయన్ డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ రక్తదానం అలాగే, అవయవ దానంపై తమ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించినట్లయితే అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడుతుందన్నారు.ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన 40 మంది సిబ్బందికి టీ షర్ట్లు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం రక్తదాత నిర్ధారణ సర్టిఫికెట్లను రక్తదాతలకు పంపిణీ చేశారు. అందరికీ స్ఫూర్తి నివ్వాలనే ఉద్దేశంతో రక్తదానానికి ముందుకు వచ్చి రక్తదానం చేసిన ఎల్పిజి టెరిటరీ మేనేజర్ తుషార్ జగతాప, ఆపరేటర్స్ మేనేజర్ లతీఫ్, ఎల్పిజి ప్లాంట్ యూనిట్ మేనేజర్ అరుణ్ కుమార్ లను లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఆ క్లబ్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఘనంగా సన్మానం చేశారు.కార్యక్రమంలో ఎల్పిజి యూనిట్ ప్లాంట్ మేనేజర్ అరుణ్ కుమార్, ఆపరేటర్స్ మేనేజర్ లతీఫ్ ,సేల్స్ ఆఫీసర్ బి .సురేష్ ,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రెడ్ క్రాస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వెంకటసుబ్బారెడ్డి, డాక్టర్ రంగనాయకులు ,డాక్టర్ ప్రభాకర్ ,సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.