ఉద్యమ సాయుధులై కదిలిన విరాళాల సేకరణ బృందం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : 4 వ రోజు విరాళాల సేకరణలో భాగంగా హొళగుందలోని ఈబిసి కాలనీలో ఉద్యమ సాయుధులై కదిలిన విరాళాల సేకరణ బృందం, అంతే ఉత్సాహంతో పోటాపోటీగా వరద బాధితుల సహాయానికై మేమున్నామంటూ సహకారాన్ని అందించిన ఈబిసి కాలనీ వాసులు.విరాళాల సేకరణ బృందానికి మరింత చైతన్యాన్ని అందిస్తూ వాడవాడలా విరాళాల విప్లవంలో నేనుసైతం అంటూ తోడై నడిచిన గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ శ్రీ రాజా పంపనగౌడ్ విజయవాడ వరద బాధితుల చేయూతకై చేదోడుగా ఈబీసీ కాలనీలో రెండు రోజులుగా జరిగిన విరాళాల సేకరణకు మానవత్వానికి మరో రూపంగా సహృదయ దాతలు కేవలం ఈబీసీ కాలనీలో మాత్రమే “72 బస్తాల బియ్యం మరియు దాదాపు 30 వేల నగదును” వరద సహాయ నిధికి విరాళాలుగా అందించడం జరిగింది.ప్రకృతిక ప్రమాదంలో బాధితులై తపిస్తున్నటువంటి విజయవాడ ప్రజలకొరకు వాడవాడలా తిరిగి విరాళాలను స్వీకరిస్తున్నటువంటి అన్ని రాజకీయ, సామాజిక వర్గాలకు వివిధ సంఘాల యువకులకు మరియు మానవియతను బలపరిచే ఈ మహా సంకల్పంలో ధనధాన్య విరాళాలను అందించి పాలుపంచుకున్న దాతలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మానవీయ వందనాలు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజా పంపనగౌడ్, తోక వెంకటేష్ ముళ్ళ మోయిన్, ఎంపీపీ తనయుడు ఈసా, వార్డ్ మెంబర్ అబ్దుల్ రెహ్మాన్, అబ్దుల్ హమీద్, వార్డ్ మెంబర్ సుభాన్, కే ,సలాం, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.