PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భ్రమరాంబ దేవికి బంగారు హారం విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శక్తిపీఠంలో ఒకటైన శ్రీ భ్రమరాంబ అమ్మవారికి హైదరాబాద్ వాస్తవ్యులు నాగోజి వెంకటేశ్వరకుమార్, శివకుమారి దంపతులు మామిడి పిందెలు డిజైనుతో కూడిన బంగారు హారాన్ని  అమ్మవారికి భక్తితో సమర్పించారు.వెంకటేశ్వర్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ హారాన్ని దేవస్థానం కార్యాలయములో ఈవో డి. పెద్దిరాజుకు అందజేయడం జరిగింది.ముత్యాలు, ఎర్రరాళ్ళు, పచ్చరాళ్ళు, తెల్లరాళ్ళతో కూడిన ఈ బంగారు హారం మొత్తం 120 గ్రాములబరువు ఉందివారికి స్వామివారి శేషవస్త్రాలను,ప్రసాదాలు, సంబంధిత రసీదు ఆలయ అధికారులు అందజేశారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ఈ హారం విలువ రూ.8,35,000/- అని దాతలు తెలియజేశారు.

About Author