PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భ్రమరాంబ దేవికి లక్ష్మి కాసులబంగారు హారం విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం:  భ్రమరాంబ దేవికి హైదరాబాద్ కు చెందిన నటరాజ్ కుటుంబ సభ్యులు లక్ష్మీ కాసుల బంగారు హారాన్ని అమ్మవారికి సమర్పించారుహారం విలువ సుమారు రూ.24,41,433/- అని దాతపేర్కొన్నారు.375 గ్రాములు 400 మిల్లీగ్రాముల బరువుగల లక్ష్మీ కాసుల బంగారు హారాన్నిఅమ్మవారి ఆలయప్రాంగణంలోని వేదఆశీర్వచన మండపంలో దాత ఈ బంగారుహారాన్ని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు  మార్కండేయస్వామి, ఆలయ సహాయ ఏఈఓ ఎం. హరిదాసు, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ రామనాయుడులకు అందజేశారు.అనంతరం వారికి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు దాత అందజేశారు.

About Author