కర్నూలు జిజిహెచ్ కు సర్జికల్ (ఆప్రాన్స్) గౌన్లు .. టవల్స్ విరాళం
1 min readఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ:
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు శ్రీ అశ్విని హాస్పిటల్ వారు రెండు లక్షల 10వేల రూపాయల విలువ గల 300 సర్జికల్ (ఆప్రాన్స్) గౌన్లు మరియు 300 టవల్స్ లను విరాళంగా అందజేసినట్లు తెలిపారు. శస్త్రచికిత్సకు శస్త్రసర్జికల్ గౌన్లు మరియు టవల్స్ ఇవ్వడానికి ముందు కొచ్చిన శ్రీ అశ్విని హాస్పిటల్ డైరెక్టర్, అయిన డా.సి.శ్రీనివాస రెడ్డి,కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఆసుపత్రిలోని సర్జికల్ గౌన్లు మరియు టవల్స్ లను పలు ఓటీ విభాగాలకు అందించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంలు, డా.శ్రీరాములు, డా.సీతారామయ్య, అనస్థీషియా హెచ్ ఓ డి, డా.విశాల, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.కిరణ్ కుమార్, శ్రీ అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, డా.సి.శ్రీనివాస రెడ్డి, డా.బి.సురేష్ కుమార్ రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ G2, శ్రీమతి. విమలమ్మ, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, తెలిపారు.