అనాథ పిల్లలకు అన్నదానం….
1 min readకర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు, ఫార్మా రిటైర్డు కలెక్టర్ రాంశంకర్ నాయక్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : సంపాదించిన దానిలో కొంతైనా.. పేదలకు సాయం చేయాలని సూచించారు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు, ఫార్మా రిటైర్డు కలెక్టర్ రాంశంకర్ నాయక్, సెక్రటరి , కార్డియాలజిస్ట్ డా. చంద్రశేఖర్. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం నగరంలోని హోప్ అనాథ ఆశ్రమంలోని 60 మంది పిల్లలకు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. అంతకు ముందు కేక్ కట్ చేసి .. పిల్లలకు తినిపించారు. ఈ సందర్భంగా ఫార్మా రిటైర్డు కలెక్టర్ రాంశంకర్ నాయక్ మాట్లాడుతూ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా అనాథలకు అన్నదానం చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అనంతరం కార్డియాలజిస్ట్, ఫౌండేషన్ సెక్రటరి డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22 ఏళ్లుగా సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. హోమ్ ఆఫ్ హోప్ అనాథ ఆశ్రమానికి భవిష్యత్లో మరింత సాయం చేయడానికి ముందుంటామన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యుడు వెంకట రమణ, న్యూరాలజిస్ట్ డా. హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.