అన్నదాత… అవయవదానం..
1 min readఅవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు
లివర్, కిడ్నీలు దానం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నిత్యం వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటి పెద్ద మరణించి పుట్టెడు దుఖంలో ఉన్నప్పటికీ వారి కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయం ఎందరికో స్ఫూర్తిధాయకమైంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామానికి చెందిన పెద్దయ్య (59) వ్యవసాయదారుడు. ఈ నెల 2వ తేదీన ఇంట్లో బ్రెష్ చేసుకుంటున్న సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. మొదడులో ఏదో పగిలినట్టు శబ్దం వచ్చినట్లు చెప్పడంతో వెంటనే కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రోగిని పరీశీలించిన వైద్యులు తలలో బ్లడ్ క్లాట్ అయ్యిందని గుర్తించారు. అతనిని రక్షించడానికి రెండు రోజులుగా వైద్యులు ఎంతో శ్రమించారు. కానీ దురదృష్టవాశాస్తూ శనివారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఃఆ తర్వాత అవయవదానంపై, ఏపీ జీవన్ దాన్ సమన్వయ కర్త డా. రాంబాబు బృందం మరియు కిమ్స్ ఆస్పత్రిలోని అవయవదాన సమన్వయకర్తలు మృతుడి కుటుంబ సభ్యులకు, బంధువలకు అవగాహన కల్పించారు. అనంతరం భార్య, కుమారులు మరియు కుటుంబ సభ్యుల అంగీకారంతో లివర్, రెండు కిడ్నీలు దానం చేశారు. చనిపోతూ కూడా మరో ముగ్గురికి ప్రాణదానం చేయడం మాకు గర్వంగా ఉందని మృతుడి భార్య, కుమారులు పేర్కొన్నారు. ఇంటి పెద్ద మరణించినా.. మరో ముగ్గురిలో జీవించి ఉన్నాడని అన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.అనంతరం ఏపీ జీవన్ ధాన్, డా. రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ ద్వారా అవసరం ఉన్నచోటికి అవయవాలను తరలించారని ఏపీ జీవన్ ధాన్ కమిటీ సభ్యులు తెలిపారు.