చెడు వ్యర్ధాలకు యువత బానిస కావొద్దు..
1 min readరూరల్ సీఐ సుబ్రహ్మణ్యం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: చెడు వ్యర్థాలకు బానిస కావద్దని నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మంగళవారం ఉదయం సిబిఎన్ సేవాసమితి మరియు పట్టణ ఆర్ఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్రీ కే రన్ ర్యాలీ నిర్వహించారు. నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి పటేల్ సెంటర్ వరకు గంజాయి మరియు మాదక ద్రవ్యాలను వాడటం వల్ల కలిగే నష్టాలు అదేవిధంగా పోలీస్ అమర వీరుల సంస్కరణ దినం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సమాజంలో గంజాయి మరియు మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జీవితాలు నాశనం అవుతాయని అన్నారు.ప్రజల కోసం అను నిత్యం తపిస్తూ ఉన్న పోలీసులు ఎంతో మంది ప్రాణాలు వదిలారని వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.అంతే కాకుండా యువత ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ ఎక్కువ యువత దీనివల్ల బానిస కాకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు.జనసేన నాయకులు శ్రీరామ థియేటర్ అధినేత రామి రెడ్డి, పట్టణ టిడిపి నాయకులు డాక్టర్ వనజ,జనసేన గుడిపాడు ప్రభాకర్. రాయలసీమ జోనల్-2 మద్దిలేటి,పుష్పరాజు,ప్రభు కుమార్,వంశీ పాల్గొన్నారు.