PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మధ్యాహ్న భోజనం నాణ్యతపై రాజీ వొద్దు: జిల్లా కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లాలో మధ్యాహ్నభోజనం అందించడం లో రాజీ పడకూడదని నాణ్యమైన భోజనం అందించడానికి అవసరమైన సూచనలు అందించాలని ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా తీసుకున్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నభోజనం నిర్వాహకులు, ఎస్​ఎంసి  ఛైర్మెన్, ఎంఈఓ లతో సమావేశం నిర్వహించారు. ప్రతి మండలం టీంలతో అమలుచేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు అమలవుతున్న మెనూ ఎలా ఉన్నది , ఇంకా ఏమైనా మార్పులు చేస్తే ఎలా ఉంటుంది  అనే విషయములను కులంకుశంగా చర్చించారు . నాణ్యమైన భోజనం పిల్లలకు పెట్టాలా అనేది గవర్నమెంట్ వారి ఉద్దేశము . శుభ్రత- నాణ్యత అన్న రెండు ప్రధాన విషయాలపై దృష్టి సారించాలని వివరించారు..అన్నిదల్లోని పర్యవేక్షణ అధికారులు ఎప్పటికప్పుడు సందర్శించి చర్యలు చేపట్టాలన్నారు.త్వరలో వంట మనుషులకు , ట్రైన్డ్​ కూక్స్ ద్వారా ట్రేనింగ్ త్వరలో ఇప్పిస్తాము .  ఈ సమావేశం లో జాయింట్ కలెక్టర్ డా. నవ్య, ట్రైనీ కలెక్టర్, జడ్పీ సీఈఓ నాసర రెడ్డి , డిఎంహెచ్​ఓ   జిల్లా విద్యాధికారి కే.శ్యామ్యూల్, మధ్యాహ్న భోజన సహాయ సంచాలకులు ఎస్ .శ్యామ్యూల్ పాల్, కేవీఆర్ కళాశాల హ్యూమన్ సైన్సస్ ప్రొఫెసర్ . ఆరతి చక్ర , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్  నుండి జ్యోతి నూట్రిస్ట్ ,   తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

About Author