ప్రతిజ్ఞ చేయడమే కాదు..వాటిని ఆచరించాలి
1 min readస్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ లో పాల్గొన్న ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రతిజ్ఞ చేయడమే కాదు ప్రతి ఒక్కరూ కూడా వాటిని ఆచరించాలని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా శనివారం చేపట్టిన ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్’ అనే కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.పట్టణంలో ఉన్న చెత్తా చెదారాన్ని సలిక బ్యాల చేత పట్టుకొని డ్రైనేజీలో ఉన్న వాటిని చెత్తా చెదారాన్ని శుభ్రం చేస్తూ వాటిని ట్రాక్టర్ లో ఎమ్మెల్యే తో పాటు డీఆర్డిఏ ఏపీడీ మరియు నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీధర్ రెడ్డి,మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,వైఎస్ చైర్మన్ మొల్ల రబ్బానీ,మున్సిపాలిటీ కమిషనర్ బేబీ వేశారు. పట్టణంలో పటేల్ సెంటర్ దగ్గర అధికారులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే ‘స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ’ చేయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతినెల మూడవ శనివారం రోజున స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగంగా పట్టణాన్ని శుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అంతే కాకుండా ఇక్కడ ప్రతి చేయడమే కాదు వాటిని పల్లెలోనూ ఇండ్లల్లోనూ ఆచరించాలని పరిశుభ్రతపై ఇతరులకు అవగాహన కల్పించాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్ళవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ,తహసిల్దార్ శ్రీనివాసులు,అంగన్వాడీ సిడిపిఓ కోటేశ్వరమ్మ, అధికారులు కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.