నిర్లక్ష్యం వద్దు – నిండు జీవితమే ముద్దు…
1 min readదెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరులో రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవలు
ముఖ్య అతిధులుగా పాల్గొన్న పలువురు ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలప్రతినిధులు, విద్యార్థులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు 2025 ఏలూరు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మాస ఉత్సవాల ర్యాలీ జెండాను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, సహా పలువురు ప్రజా ప్రతినిధులు – జెండా ఊపి అవగాహన ర్యాలిని ప్రారంభించరు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు – ర్యాలీలో పాదాచారులకు, ద్విచక్ర వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు, విద్యార్థులకు, పలు సంస్థల ప్రతినిధులకు రహదారిపై తీసుకోవలసిన భద్రత ప్లే కార్డులు చూపిస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “రహదారులపై జరిగే ఎన్నో ప్రమాదాలకు స్వల్ప నిర్లక్ష్యాలే కారణాలై ఆ కుటుంబాలకు పెను ప్రమాదాన్ని మరియు నష్టాన్ని కలగజేస్తున్నాయని, అందువల్ల రహదారులపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా నడపడం నిర్లక్ష్య ధోరనిలో ఉండరాదని సూచించారు. వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రమాదాలకు కారణాలు కావడం వంటివి చేయకుండా రవాణా శాఖ అధికారులు తెలిపినట్లు రోడ్డు భద్రతా నియమాలను, జాగ్రత్తలను పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా తమ నిండు ప్రాణాన్ని, జీవితాన్ని కాపాడుకోవాలన్నారు.